Jul 30,2023 08:11
  • పలు మార్గదర్శకాలు విడుదల

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రాష్ట్రాల పరిధిలోని సహకార రంగంపై కేంద్ర ప్రభుత్వం మరింతగా పట్టుబిగిస్తోంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా వాణిజ్య బ్యాంకుల తరహాలో వాటిని మార్చేందుకు కసరత్తు ప్రారంభించింది. దీనిలో భాగంగా కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. వాటిని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసింది. సహకార బ్యాంకులు గరిష్టంగా ఐదు కొత్త శాఖలను ప్రారంభించుకోవచ్చని పేర్కొంది. సహకార బ్యారకుల బోర్డు రాజీ ఒప్పందాలు, వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్లు, వంటివాటిపై నేరుగా నిర్ణయాలు తీసుకోవచ్చని పేర్కొంది. ప్రాధాన్య తా రంగంపై రుణాల లక్ష్యాన్ని సాధిరచేరదుకు పట్టణ సహకార బ్యారకులకు అదనరగా రెరడేళ్ల కాలపరిమితిని కూడా కల్పిరచాలని నిర్ణయిర చారు. సహకార బ్యారకుల చైర్మన్లు, మేనేజిరగ్‌ డైరెక్టర్లు, సిఇలను నియమిరచుకోవాలన్నా, తొలగిరచాలన్నా, పునర్నియామకం చేయాలన్నా 90 రోజుల గడువు ఇచ్చారు. అలాగే ఆడిటర్లకు సంబంధిరచి 30 రోజుల గడువు ఇచ్చారు.ఈ బ్యారకుల దైనందిక వ్యవహారాల కోసం రిజర్వ్‌బ్యారకు ఒక నోడల్‌ అధికారిని కూడా నియమిరచనురది. బ్యారకు సేవలను ఇళ్లవద్దకు వెళ్లి అందించేందుకు, ఒక వ్యక్తికి రెండుసార్లుకన్నా ఎక్కువ పర్యాయాలు వ్యక్తిగత రుణాలు ఇచ్చేందుకు అంగీకరిస్తున్నట్లు ఈ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. వీటిప్రకారం వాణిజ్య రియల్‌ ఎస్టేట్‌ రంగంలోని నివాస గృహాలకు కూడా సహకార బ్యాంకులు రుణాలు ఇవ్వొచ్చు.