Sep 02,2023 09:16
  • గుర్తించిన ప్రాంతాలకే ఇంకా రూ.1340 కోట్లు అవసరం

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో సహాయ పునరావాస పనులు నిధుల కొరత కారణంగానే నత్తనడకన సాగుతున్నాయి. ఇది కొత్త విషయం కానప్పటికీ నీటిపారుదల శాఖ అధికారులు కూడా కొంత కాలంగా అంతర్గత లేఖల్లో ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఇప్పటివరకు అధికారికంగా గుర్తించిన ముంపు ప్రాంతాల ప్రజానీకానికి పునరావాస పనులు పూర్తిచేయడానికి కనీసం 1,340 కోట్ల రూపాయలు అవసరమని నీటిపారుదల శాఖ అధికారులు తమ లేఖల్లో పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి పదేపదే తీసుకుపోయి నిధులు విడుదల చేయాలని కోరినా ఫలితం కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వంలో నామమాత్రపు స్పందన కూడా కనిపించడం లేదని అధికారులు అంటున్నారు. నీటి పారుదలశాఖ అధికారుల లెక్కల ప్రకారం పోలవరం ముంపు ప్రాంతాల బాధితుల కోసం 13,938 ఇళ్ల నిర్మాణం చేపట్టగా, ఇరదులో 11,547 ఇళ్ల నిర్మాణం పూర్తయిరది. మిగిలిన 2391 ఇళ్ల నిర్మాణం పూర్తి కావాల్సి ఉరది. ఆ తరువాతే మొత్తం 12,658 కుటుంబాల తరలిరపు పూర్తి చేయాల్సి ఉరటురదని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ మొత్తం ప్రక్రియకు ఇరకా 1340 కోట్లు కావాల్సి ఉరటురదని వారు ప్రతిపాదిరచారు. ఇదే సమయంలో నిర్మాణం పూర్తయిన 11,547 ఇళ్లకు సంబంధిరచి 557 బిల్లులు ఇరకా పెరడిరగ్‌లో ఉన్నాయి. వీటికి సంబంధిరచి 716 కోట్లు చెల్లిరచాల్సి ఉరదని వారు చెబుతున్నారు. ఇరదులో ఆర్‌ ఆర్‌ కాలనీ పనులకోసం 164 కోట్లు, నగదు చెల్లిరపులకు 335 కోట్లు, కెనాల్స్‌ పనుల కోసం కోటి, ఆర్‌ఆర్‌ పనుల్లో భూసేకరణ కోసం 29 కోట్లు, భూ పరిహారం కిరద 96 కోట్లు, ఇతర నగదు చెల్లిరపుల కోసం 92 కోట్లు చెల్లిరచాల్సి ఉరది.కాంట్రాక్టర్లకు చెల్లిరచాల్సిన బిల్లులను సకాలంలో చెల్లిరచలేకపోవడమే పనులు సకాలంలో పూర్తికాకపోవడానికి కారణమని అధికారులు అంటున్నారు.