హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీఎస్ టెట్) నోటిఫికేషన్ మంగళవారం విడుదలయ్యింది. సెప్టెంబర్ 15న టెట్ పేపర్-1, పేపర్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. ఆగస్టు 2వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. పేపర్-1 పరీక్షకు డీఈడీ, బీఈడీ అభ్యర్థులిద్దరూ రాసుకునే అవకాశం కల్పించారు. సెప్టెంబరు 15న టెట్ పరీక్ష, సెప్టెంబర్ 27న టెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. టెట్ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్ సైట్‌లో చూడొచ్చు.










