Apr 21,2023 09:18
  • మరొకరికి తీవ్రగాయాలు

న్యూఢిల్లీ : జమ్ముకాశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లాలో ఉగ్రవాదులు సైనిక వాహనంపై గ్రనేడ్లతో విరుచుకుపడ్డారు. దీంతో ఆర్మీ వాహనం తగలబడి అందులోని సైనికుల్లో ఐదుగురు సజీవ దహనమయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పూంచ్‌ జిల్లా బింభేర్‌ గలి నుంచి సాంగియోట్‌ వైపు ట్రక్‌ వెళుతుండగా గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయం లో రాజౌరి సెక్టార్‌ వద్ద ఈ ఉగ్రదాడి చోటుచేసుకుంది. భారీ వర్షాలులో విజిబులిటీ వంటి పరిస్థితులను అనుకూలంగా చేసుకున్న ఉగ్రవాదులు గ్రనేడ్లతో మెరుపుదాడికి దిగారని సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ దాడిలో ట్రక్‌ మంటల్లో చిక్కుకుందని తెలిపింది. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన ఒక సైనికుడిని చికిత్స కోసం రాజౌరిలోని సైనిక ఆస్పత్రికి తరలించారు. అమరులైన సైనికులందరూ రాష్ట్రీయ రైఫిల్స్‌ యూనిట్‌కు చెందినవారు. ఈ ఘటనపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.