తిరువనంతపురం : కేరళ పేలుళ్ల నిందితునికి కోర్టు సోమవారం నవంబర్ 15 వరకు పోలీస్ కస్టడీ విధించింది. అంతర్జాతీయ సంబంధాలు సహా పేలుళ్లకు వినియోగించిన పేలుడు పదార్థాలకు ఎక్కడి నుండి వచ్చాయనే అంశాలను దర్యాప్తు చేయాల్సి వుందని పోలీసులు రిమాండ్ పిటిషన్‌లో ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ మరియు సెషన్స్ కోర్టుకు తెలిపారు. అలాగే నిందితుని సాక్ష్యాధారాల కోసం పది ప్రాంతాలకు తీసుకువెళ్లాల్సి వుందని పేర్కొన్నారు. దీంతో నిందితునికి 15 రోజుల రిమాండ్ విధిస్తున్నట్లు జడ్జి హనీ ఎం.వర్గీస్ తెలిపారు. అలాగే నిందితుడు వ్యక్తిగత హాజరును ఎంచుకున్నందున అతను విచారణ కోసం ఎప్పుడైనా న్యాయవాది సేవలను వినియోగించుకోవచ్చని జడ్జి సూచించారు.
గత ఆదివారం కలమస్సేరిలోని జెహోవా సాక్షుల సమావేశంలో జరిగిన వరుస పేలుళ్లలో నలుగురు మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. ఈ పేలుళ్లకు కారణమైన నిందితుడు వి.డి. మార్టిన్ పోలీస్ స్టేషన్‌లో లంగిపోయిన సంగతి తెలిసిందే.