ఏలూరు : ద్వారకాతిరుమల మండలం తిరుమలంపాలెంలో ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ... శుక్రవారం ఉదయం మారంపల్లి నుంచి ద్వారకాతిరులకు టిడిపి శ్రేణులు పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రగా వస్తున్న టిడిపి నాయకులను, కార్యకర్తలను పోలీసులు అడ్డగించారు. శాంతియుతంగా చేస్తున్న పాదయాత్రను ఎందుకు అడ్డుకుంటున్నారని టిడిపి నాయకులు ప్రశ్నించారు. దీంతో టిడిపి నాయకులు అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నించారు. పోలీసులకి టిడిపి నాయకులకు మధ్య తీవ్రవాగ్వాదం, తోపులాట జరిగింది. టిడిపి పాదయాత్ర కొనసాగుతోంది.