ఎన్‌టిఆర్ : విటిపిఎస్ హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. విటిపియస్ భద్రతా ప్రమాణాల వైఫల్యం వల్ల చనిపోయిన కోల్డ్ ప్లాంట్ కాంట్రాక్టు వర్కర్ మల్లవరపు శౌరీ కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ... శక్తి నగర్ వాసులు, కార్మిక సంఘాల నేతలు శనివారం ఉదయం విటిపిఎస్ బోర్డు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు.
విధుల్లో ఉండగా ప్రమాదం.. మృతి..
డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రంలో ప్రమాదవశాత్తు కార్మికుడు మల్లవరపు సౌరిబాబు (35) కోల్ ప్లాంట్ స్టేజ్ 1 లో కాంట్రాక్ట్ లేబెర్ గా పని చేస్తున్నాడు. సుమారు 4.30 గంటల సమయంలో రెండు బోగీలు కలిపే సమయంలో ప్రమాదం సంభవించి సౌరిబాబు మృతి చెందాడు. మృతుడు ఇబ్రహింపట్నం శక్తి నగర్‌కు చెందిన వ్యక్తి. అతడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. సౌరిబాబు మఅతదేహాన్ని ఏ కాలనీ విటిపిఎస్ హాస్పిటల్ కి తరలించారు. ఆసుపత్రి వద్దకు మృతుడి తరపు బంధువులంతా చేరుకున్నారు.
యాజమాన్యం హామీతో ఆందోళన విరమణ...
మఅతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ... ఈరోజు ఉదయం టిడిపి, ఎంఆర్‌పిఎస్ ఆధ్వర్యంలో హాస్పిటల్ వద్ద ఆందోళన చేశారు. మఅతుడు మల్లవరపు శౌరిబాబు కుటుంబానికి కోటి రూపాయలు ఏక్స్‌గ్రేషియ చెల్లించాలని, భార్యకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విటిపిఎస్ యాజమన్యం స్పందించకపోవడంపై కార్మిక సంఘాలు, ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. విటిపిఎస్ సిఈ వెంటనే స్పందించాలని, లేకపోతే విటిపిఎస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో మఅతుని కుటుంబ సభ్యులు, ట్రేడ్ యూనియన్ నాయకులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, ఎంఆర్‌పిఎస్ నాయకులతో యాజమాన్యంతో జరిగిన చర్చల్లో మఅతుని కుటుంబానికి రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా, ఇతర బీమా, బెనిఫిట్ల కింద సుమారు రూ.17 లక్షలు, మఅతుని భార్యకు సిఎల్ ఉద్యోగం ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన ముగిసింది.