
గుంటూరు : గుంటూరులో ఉద్రిక్తత నెలకొంది. టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ... నేడు టిడిపి రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బంద్‌లో భాగంగా... సోమవారం గుంటూరులోని షాపులను టిడిపి నేతలు, కార్యకర్తలు మూసివేయించారు. మూసేసిన ఆ షాపులను వైసిపి నేతలు తెరిపించారు. దీంతో వివాదం రాజుకుంది. ఇదిలా ఉండగా .... జనసేన ఎమ్మార్పీఎస్సీ కార్యకర్తలు రాస్తారోకో చేపట్టారు. ఈ రాస్తారోకోను అడ్డుకున్న పోలీసులు వారిని బలవంతంగా అరెస్టులు చేశారు. ఎమ్మెల్యే మద్దాల గిరి, మేయర్ కావటి మనోహర్ నాయుడు ఆధ్వర్యంలో కొందరు కర్రలు తీసుకొని హల్ చల్ చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. మరోవైపు ... గుంటూరు జిల్లా కుంచపల్లిలో టిడిపి-జనసేన ఆందోళన చేపట్టాయి. తాడేపల్లి బైపాస్ కుంచనపల్లి కూడలి వద్ద టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. టిడిపి అధ్యక్షులు అమరా సుబ్బారావు, జనసేన గ్రామ అధ్యక్షుడు మేకల రాజా అరెస్టయ్యారు. టిడిపి నాయకులతోపాటు జనసేన నాయకులు బంద్‌లో పాల్గన్నారు. టిడిపి రూరల్ అధ్యక్షుడు అమరా సుబ్బారావు, జనసేన గ్రామ అధ్యక్షుడు మేకల రాజాను అరెస్టు చేసి తాడేపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. దీంతో పోలీసులకు, టిడిపి, జనసేన నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. అక్రమ అరెస్టులను టిడిపి తాడేపల్లి రూరల్ అధ్యక్షులు అమరా సుబ్బారావు, జనసేన కుంచనపల్లి గ్రామ అధ్యక్షులు మేకల రాజా ఖండించారు.