గుంటూరు : గుంటూరు నగరంలోని లాడ్జి సెంటర్‌లో టిడిపి బీసీ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది.
ఇటీవల టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రలో భాగంగా ... ఒంగోలులో ఆ పార్టీ 'జయహౌ బీసీ' కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ కార్యక్రమానికి టిడిపి పెయిడ్ ఆర్టిస్టులను తెచ్చిందంటూ ... వైసిపి ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు, మంత్రి జోగి రమేశ్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ ... ఈరోజు గుంటూరు లాడ్జి సెంటర్‌లో టిడిపి నేతలు ఆందోళన చేశారు. దిష్టిబమ్మ దహనం చేసేందుకు నేతలు యత్నించగా, పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఈక్రమంలో టిడిపి బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ యాదవ్‌పై ఎస్సై నాగరాజు పిడిగుద్దులతో దాడి చేశారు. వైసిపి ప్రభుత్వం, పోలీసుల తీరును నిరసిస్తూ ... అంబేడ్కర్ విగ్రహం వద్ద టిడిపి బీసీ నేతలు నిరసన చేపట్టారు.