ప్రజాశక్తి-తెనాలిరూరల్(గుంటూరు) : హాఫ్ పేట వార్డు మెంబరు పోటీకు జరిగిన ఉపఎన్నికల్లో మొత్తం 152 ఓట్లకు గాను 130 ఓట్లు నమోదయ్యాయి. మహిళలు 64 పురుషులు 60 ఓట్లు వినియోగించుకున్నారు. బుర్రిపాలెం సర్పంచ్ ఉపఎన్నికల్లో మొత్తం 2738 ఓట్లు నమోదవ్వగా 2144 ఓటర్లు తమ ఓట్లను వినియోగించుకున్నారు. బుర్రిపాలెం ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. మధ్యాహ్నం 02:00 గంటలకు జరిగే కౌంటింగ్ ప్రక్రియకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం ఏడుకొండలు తెలిపారు. పోలింగ్ ప్రారంభం నుంచి బూత్‌ల వద్ద అదనపు పోలీసు బలగాలను మోహరించినట్లు తెనాలి డిఎస్పి జనార్దనరావు తెలిపారు ఓట్లు లెక్కింపులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసామన్నారు. సాయంత్రం 04 గంటలతో ఓట్లు లెక్కింపు ముగుస్తుందని,ఫలితాలు కూడా వెంటనే ప్రకటిస్తామని తెనాలి మండలాధిఖారి విజయలక్ష్మణ్ తెలియజేశారు. బుర్రిపాలెం గ్రామ సర్పంచ్ ఉప ఎన్నిక బరిలో గెలుపు తధ్యమని టిడిపి ఆశావహులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.










