Jul 10,2023 08:35

పుస్తకాలతో పునాది కడతాం
బలపాలతో బీములు వేస్తాం
పలకలతో స్లాబులు పోస్తాం
అక్షరాలతో అంతస్తులు నిర్మిస్తాం
గుణింతాలతో గోడలు కడతాం
రంగుల కలాలతో రంగులేస్తాం
విజ్ఞానం ఎంతో నేర్చేస్తాం
బడినే ఒక గుడిగా భావిస్తాం
చదువులమ్మ గుడిలో నిద్రిస్తాం
విజ్ఞానాన్ని విశ్వ వ్యాప్తం చేస్తాం!

- బోనగిరి పాండురంగ,
తొర్రూరు.