Aug 30,2023 10:10

అమ్మ ప్రేమ మాధుర్యమే తెలుగు
ఆకాశమంత ఆనందం తెలుగు
ఇలలో విరిసిన ఇంద్రధనస్సు తెలుగు
ఈడేరిన మధుర కల మన తెలుగు

ఉరికే జలపాతం తెలుగు
ఊయల పాట తెలుగు
ఋతువుల గమనం తెలుగు
ఎలుగెత్తి పాడే పాట తెలుగు
ఏరువాక జానపదం తెలుగు
ఐరావతమై వరాలు కురిపించు తెలుగు

ఒగ్గు పాటల స్వరమే తెలుగు
ఓరుగల్లు పౌరుషం తెలుగు
ఔదార్యముతో మెలుగు తెలుగు
అందరి జీవనానికి వెలుగు తెలుగు
 

మొర్రి గోపి,
8897882202.