ఇటీవల కవిసంధ్య, యానాం వారి ద్వారా జీవన సాఫల్య పురస్కారాన్ని పొందిన దీర్ఘాసి విజయ భాస్కర్, నాటక రంగంలో తనదైన విశిష్ట పాత్ర పోషిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనతో సంభాషణ టూకీగా... తెలుగు నాటకం అంతర్జాతీయ స్థాయికి వెళ్లాలి
కథలు , నాటకాలు , కవిత్వం ... ఇలా మూడింటిలోనూ పేరు పొందిన మీకు బాగా ఇష్టమైన ప్రక్రియ ఏది ?
నాకు ఇష్టమైన ప్రక్రియ అనేకంటే సమాజానికి ఎక్కువ ఉపకారం చేసేది నాటకం. అందుకే నాటకమంటే ఇష్టం కావచ్చు. కథ, నవల, కవిత్వం... వేటి ప్రత్యేకత వాటికి ఉన్నప్పటికీ నాటకం లక్ష్యం వేరు. అది సామాన్యుని కోసం పుట్టింది. సమాజంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని మొదట కవిత్వం గుర్తిస్తుంది. కథ విశ్లేషించి వివేచన చేస్తుంది. నాటకం పరిష్కారాన్ని సూచిస్తుంది. నవల ఆ సమస్యా పరిష్కారాల ఫలితాల్ని పర్యవ్యసనాల్ని చర్చిస్తుంది. కాబట్టి నాటకం ప్రయోజనం చాలా ఉన్నతమైంది. కాల ప్రక్షాళనమే దాని లక్ష్యం.
మీ రచనల్లో తాత్విక భావజాలం ఉండడానికి నేపథ్యం ?
ఇతర జీవులకు , మానవుడికి మధ్య నున్న తేడా తాత్వికతే. Man is a social animal, political animal అంటారు కదా! వీaఅ ఱర a Man is a philosophical and spiritual Animal. నాటక రచనలో నాకో ర్‌తీa్‌వస్త్రy ఉంది. అదేమిటంటే ఒకటి దోపిడీకి గురై అట్టడుగు పొరల్లో చిక్కుకు పోయిన వారిని వారి హక్కుల పట్ల వారి దుస్థితి పట్ల అవగాహన కలిగించడం. రెండు పాలక వర్గాల చేతిలోనే శాసనాధికారముంటుంది కనుక వారి ఇంట్రెస్ట్‌కి వ్యతిరేకంగా వారు శాసనాలు చేసుకోరు. ఇక వారిలో మార్పు ఎలా వస్తుంది? కేవలం ఆధ్యాత్మిక చింతన వల్ల మాత్రమే మార్పువచ్చే అవకాశం ఉంది . ఇక మూడవది కుటుంబ పరమైన ఇతివత్తాలు. ఆదర్శంగా ఒక ఋషి కన్న ఒక గహస్తుడు బతకడం కష్టం. ప్లేటో పాలకులకు కుటుంబాలు నిషేధించాడు. కుటుంబ సభ్యులు పాలకుల్ని, అధికారుల్ని అవినీతివైపు ఎలా ప్రేరేపిస్తారో చెబుతూ కొన్ని నాటకాలు రాశాను.
మీ నాటకాల్లో కొన్నింటిలో పౌరాణిక నేపధ్యం కనిపిస్తుంది. కారణం ?
మన సామాజిక వ్యవస్థ ఇన్ని అవస్థలతో ఉండడానికి ముఖ్య కారణం పౌరాణిక నేపధ్యంలో మన పూర్వీకుల బుర్రలోకి ఎక్కించిన భావజాలం. ఒకప్పుడు ఎవరైనా నయంకానీ వ్యాథితో బాధపడుతుంటే అది అతను పూర్వజన్మలో చేసుకున్న పాపంగా సర్దిచెప్పుకునేవారు. కొన్ని కులాల వారిచేత అమానుషమైన పనులుచేయించి వారి పాపపుణ్యాలకు లింకు పెట్టారు. పూర్వీకులు అదంతా నిజమని నమ్మారు. బడుగు వర్గాల అణిచివేతకు ఆ కధల్ని ఎలా వాడుకున్నారో ఇప్పుడిప్పుడే సమాజం అర్ధం చేసుకుంటోంది. ఈ అవగాహన ఇంకా తొందరగా జరగాలి. అందుకే నేను నాటక రచనలో పౌరాణిక నేపధ్యాన్ని ఉపయోగిస్తున్నాను. మనిషి ఆలోచనా పరిధిని ఏ కండిషనింగ్ ద్వారా కుంచించుకుపోయేటట్టు చేశారో, డీ-కండిషనింగ్ ద్వారా నేను అవగాహనా శక్తిని విస్తత పరచాలని నా ప్రయత్నం.
మీ సూత రంగస్థలి గురించి చెప్పండి ?
రంగస్థల కళల గురించి ఒక ప్రామాణికి గ్రంధం భరత ముని రచించిన 'నాట్యశాస్త్రం'. దీన్ని నాట్యవేదమని పంచవేదమని పిల్చి ఎంతో గౌరవిస్తాం. దీనికి సమాంతరమైనది గ్రీకు తత్వవేత్త రచించిన 'పొయెటిక్స్' అనే గ్రంధం. ఆ తర్వాత ప్రపంచంలో అనేకమైన రంగస్థల సిద్ధాంతాలు, ఉద్యమాలు వచ్చాయి. అవన్నీ పాశ్చాత్య దేశాల నుంచి వచ్చినవే తప్ప, భారతీయ సంస్క ృతీ నాగరికతల మీద ఆధారపడి ఏ రంగస్థల సిద్ధాంతం రాలేదు. భారతీయ సంస్కతీ ఆధారంగా ఉన్న ఐతిహ్యాలను, పాత్రలను, సామాజిక వ్యవస్థలను, వ్యక్తులను, విలువలను, చారిత్రక లోటుపాట్లను, తద్వారా కొన్ని తరగతులవారు అనుభవిస్తున్న దుర్బర దారిద్య్రాన్ని, సామాజిక అసమతౌల్యాన్ని వ్యాఖ్యానిస్తూ విశదీకరిస్తూ వాటికి మార్గాన్వేషణ చేస్తాడు 'సూతుడు'. సూత మహర్షి మనకూ అష్టదశ పురాణాలు చెప్పినవాడు. అతని పేరుతో 'సూత రంగస్థలి'గా నా సిద్ధాంతం ఉంటుంది
తెలుగు నాటక రంగం స్టేజ్‌క్రాఫ్ట్‌లో వెనుకబడి ఉందని పదేళ్ల క్రితం అన్నారు . ఇప్పుడూ అదే అభిప్రాయంతో ఉన్నారా ?
ఈ పదేళ్లలో కూడా థియేటర్ల నిర్మాణపరంగా ఏ కృషీ జరగలేదు. స్టేజ్‌క్రాఫ్ట్‌లో గుణాత్మక మార్పులు రావాలంటే పరిపూర్ణ సాంకేతిక థియేటర్లు రావాలి. మనకు మంచి రచయితలున్నారు. నటీనటులు, దర్శకులున్నారు. లేనిదంతా ఆదరణ, ఆవరణ. ఇతర సాహిత్య ప్రక్రియలకు ఒకటే భాష ఉంటుంది. కానీ నాటకానికి రెండు భాషలుంటాయి. ఒకటి రచయిత వాడే భాష. ఈ భాషను ప్రేక్షకుడికి అందించే క్రమంలో దర్శకుడు వాడే 'రంగస్ధల భాష.' ఈ విషయంలో తెలుగు రంగస్థలం వెనుకబడిి ఉంది.
ఇటీవల నోబెల్ బహుమతి పొందిన నార్వే రచయిత జాన్ పొసే నాటక రచయిత కూడా! భారతీయ నాటకం ఎప్పటికైనా ఆ స్థాయిని అందుకోవడం ఊహించగలమా ?
భారతీయ నాటకమే కాదు; తెలుగు నాటకం కూడా అందుకుంటుంది. ప్రతి సమాజానికి ఒక్కో ప్రత్యేకమైన సాంస్కతిక నేపధ్యముంటుంది. ఆ నేపధ్యం అర్ధమైతే తప్ప ఆ రచనలోని గొప్పదనం అర్ధం కాదు. నా 'రాజిగాడు రాజయ్యాడు' తీసుకుందాం. అత్యంత వెనుక బడిన కులాల ప్రతినిధి రాజిగాడు. దిక్కుమొక్కు లేని కులాల ఆవేదన దానిలో ఆవిష్కరించాను. కన్యాశుల్కంలోని సమస్యను అర్ధం చేసుకున్నంత బాగా రాజిగాడి ఆవేదన అర్ధం చేసుకోరు. ఈ గ్యాప్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనే కాదు. మన రాష్ట్రంలో వివిధ కులాల మధ్య కూడా ఉంటుంది. కాబట్టి అవార్డులిచ్చే వారికి నాటకంలో ఆవిష్కరింపబడే సమాజం పట్ల, సమస్య పట్ల, శిల్పం పట్ల, సాహిత్యవిలువల పట్ల, అవగాహన ఉండాలి. సానుభూతి, సహానుభూతి ఉండాలి. దీనికి ఉదాహరణగా విదేశీయులు మత్స్యకారుల జీవితాన్నీ తెలుసుకోవడంలో లోజె.ఎమ్.సిన్జ్‌ని అర్ధం చేసుకున్నట్టు మన గణేష్ పాత్రోని అర్ధం చేసుకోలేరు.
మీ భవిషత్తు కార్యాచరణ ఎలా ఉండబోతోంది ?
తెలుగు నాటకాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకొని వెళ్లడమే నా భవిషత్తు ప్రణాళిక.
సంభాషణ : టేకుమళ్ళ వెంకటప్పయ్య