Aug 01,2023 11:44

హైదరాబాద్‌ : తన ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించాలని కోరుతూ ... టిఆర్‌ఎస్‌ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ధర్మపురి నియోజకవర్గం నుంచి అక్రమ పద్ధతుల్లో గెలిచిన కొప్పుల ఈశ్వర్‌ ఎన్నిక చెల్లదని ప్రకటించాలని, ఆ స్థానంలో తనను ఎమ్మెల్యేగా ప్రకటించాలని కోరుతూ... ఎన్నికల్లో ఓటమిపాలైన కాంగ్రెస్‌ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ 2018లో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను తిరస్కరించాలంటూ... మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మధ్యంతర పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై నేడు విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది. విచారణను రేపటికి వాయిదా వేసింది.