ప్రజాశక్తి-అమరావతి(గుంటూరు) : మండల కేంద్రంలోని పలు హౌటల్లో తహశీల్దార్ విజయశ్రీ ఆకస్మిక దాడులు చేపట్టారు. కమర్షియల్ సిలిండర్‌కు బదులు గృహ వినియోగదారులు వాడే సిలిండర్లు వాడుతున్నట్లు గుర్తించారు. దుర్గ విలాస్ హౌటల్లో 4 సిలిండర్లు శంకర్ విలాస్‌లో 1, లాంగ్ కచ్చి బిర్యానీ పాయింట్‌లో 3, సత్తనపల్లి రోడ్డులోని బేకరీలో3 మొత్తం 11 సిలిండర్లను గుర్తించిం సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ రాజశేఖర్ వీఆర్వో క్రాంతి వెంకటకృష్ణ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.










