
- 23 పరుగుల తేడాతో నేపాల్‌పై ఘన విజయం..
హాంగ్‌జౌ : ఆసియాక్రీడలు-2023 పురుషల క్రికెట్‌లో టీమిండియా సెమీఫైనల్‌కు చేరింది. హాంగ్‌జౌ వేదికగా జరిగిన క్వార్టర్‌పైనల్-1లో నేపాల్‌పై 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ యశస్వీ జైశ్వాల్(100) సెంచరీతో చెలరేగగా.. ఆఖరిలో రింకూ సింగ్(37 నాటౌట్ ), శివమ్ దుబే(25 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. నేపాల్ బౌలర్లలో దిపేంద్ర సింగ్ రెండు వికెట్లు పడగొట్టగా.. లమిచానే,కామి ఒక్క వికెట్ పడగొట్టారు. 203 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 179 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో రవి బిష్ణోరు, అవేష్ ఖాన్ తలా మూడు వికెట్లతో చెలరేగగా.. అర్ష్‌దీప్ రెండు, సాయి కిషోర్ ఒక్క వికెట్ సాధించారు.