
తిరువనంతపురం: భారత్-నెదర్లాండ్స్ జట్ల మధ్య జరగాల్సిన వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. ప్రపంచకప్ ముంగిట నిర్వహిస్తున్న వార్మప్ మ్యాచ్‌లకు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. వర్షం అంతరాయం కారణంగా ఒక్క బంతి పడకుండానే మ్యాచ్‌లు రద్దవుతున్నాయి. కనీసం టాస్ పడకుండానే ఈ మ్యాచ్ రద్దయింది. దీంతో టీమిండియా వన్డే ప్రపంచకప్‌కు ముందు ఆడాల్సిన రెండు సన్నాహక మ్యాచ్‌లు వర్షార్పణం అయినట్లయింది. ఇక 5న ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్‌తో ఐసిసి వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. భారతజట్టు తన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో 8న చెన్నైలో తలపడనుంది.