Sep 25,2023 20:33

న్యూఢిల్లీ: కార్పొరేట్‌ దిగ్గజం టాటా సన్స్‌ త్వరలో ఇన్షియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపిఒ)కు రానుందని సమాచారం. ఒకవేళ అదే జరిగితే భారత్‌లోనే అతిపెద్ద ఇష్యూగా నిలువనుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇటీవల టాటా సన్స్‌ను 'అప్పర్‌ లేయర్‌ నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ'గా గుర్తించిన విషయం తెలిసిందే. ఈ కేటగిరీలోకి వచ్చిన సంస్థ మూడేళ్లలో స్టాక్‌ మార్కెట్‌లో లిస్టింగ్‌ కావాల్సి ఉంటుంది. టాటా సన్స్‌ ప్రస్తుత విలువ రూ.11 లక్షల కోట్లని అంచనా!. ఒక వేళ ఐపిఒకు రావద్దనుకుంటే కంపెనీని పునర్‌వ్యవస్థీకరించడం వల్ల ఆర్‌బిఐ నిబంధనల నుంచి మినహాయింపు పొందవచ్చు.