ముంబయి : దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ తన 9వ వార్షిక సిఎస్‌ఆర్ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఆరోగ్యం, విద్యా, పర్యావరణ రంగాల్లోని సామాజిక సవాళ్లను పరిష్కరించేందుకు విస్తృత ప్రయత్నాలు చేసినట్లు పేర్కొంది. ఈ క్రమంలోనే కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్‌ఆర్) కింద గత 10 ఏళ్లలో 60 లక్షల మందికి ప్రయోజనం కల్పించినట్లు వెల్లడించింది.