దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. 2023-24 సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో రూ.3,764 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.944.61 కోట్ల నష్టాలు చవి చూసింది. 2023 జూన్‌తో ముగిసిన త్రైమాసికం రూ.3,202.80 కోట్ల లాభాలతో పోల్చితే గడిచిన క్యూ2లో 17.5 శాతం వృద్థిని కనబర్చింది. ఏడాదికేడాదితో పోల్చితే కంపెనీ మొత్తం రెవెన్యూ 32 శాతం పెరిగి రూ.1.05 లక్షల కోట్లకు చేరింది. జాగ్వర్ లాండ్ రోవర్ రెవెన్యూ 30 శాతం పెరిగి 6.9 బిలియన్ పౌండ్లుగా చోటు చేసుకుంది.