Mar 08,2023 21:31

న్యూఢిల్లీ : టాటా గ్రూపునకు చెందిన స్ట్రైడర్‌ కొత్త ఇ-బైక్‌ను ఆవిష్కరించింది. దీని ధరను రూ.31,999గా నిర్ణయించింది. అయితే పరిమిత కాలపు ఆఫర్‌ కింద 20 శాతం తగ్గింపునతో రూ.25,5999కు అందిస్తున్నట్లు వెల్లడించింది. ఛార్జింగ్‌, పెడల్‌ హైబ్రిడ్‌ మోడల్‌తో రూపొందించిన ఈ బైకును ఒక్క సారి ఛార్జింగ్‌ చేస్తే 40 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని తెలిపింది. గరిష్టంగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని పేర్కొంది. దీన్ని స్ట్రైడర్‌ వెబ్‌సైట్‌లో బుక్‌ చేసుకోవచ్చని తెలిపింది.