May 20,2023 09:41

ఎండవేడికి చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ ప్రభావితమౌతారు. ముఖ్యంగా ఈ కాలంలో చిన్నపిల్లలకు చర్మ వ్యాధులు అధికంగా వస్తాయి. వాటి నివారణకు కొన్ని చిట్కాలు పాటించాలి.

  • తరచూ పిల్లలతో నీటిని తాగించాలి.
  • పౌష్టిక ఆహారాన్ని అందించాలి.
  • అధిక వేడి వల్ల ఒక్కోసారి చిన్నపిల్లల ముక్కు నుంచి రక్తం కారుతుంటుంది. దాని నివారణకు పిల్లలు డిహైడ్రేడ్‌ కాకుండా చూసుకోవాలి. అయినా తగ్గకపోతే వెంటనే వైద్యుని సంప్రదించాలి.
  • వేసవిలో చిన్నపిల్లల్లో యూరినరీ ఇన్ఫెక్షన్స్‌ వస్తుంటాయి. ఇన్ఫెక్షన్‌ రాకుండా వుండాలంటే నీళ్లతో పాటు కొబ్బరి నీరు, నిమ్మరసం తాగించాలి.
  • అధిక ఉష్ణోగ్రతలకు చిన్నపిల్లల్లో స్పృహ కోల్పోవడం, వాంతులు విరేచనాలు కావడం జరుగుతుంది. ఈ సైడ్‌ ఎఫెక్ట్స్‌ బారిన పడకుండా ఉండాలంటే ఫ్రిడ్జ్‌ నీళ్లను తాగకుండా, కుండ నీటిని తాగడం మంచిది. డిహైడ్రేట్‌ కాకుండా కుండ నీరు మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
  • చర్మ వ్యాధులు, చీము గడ్డలు, ఎలర్జీ వంటి వ్యాధులు కూడా పిల్లల్లో ఈ సమయంలో ఎక్కువగా కనబడతాయి. వీటి నివారణకు ఆకుకూరలు, పెరుగు, గుడ్లు వంటి వాటిని క్రమం తప్పకుండా ఇవ్వాలి.