Jul 31,2023 15:48

హైదరాబాద్‌: నగరంలోని ఐటీ కారిడార్‌లో మహిళల కోసం ప్రత్యేక బస్సును టీఎస్‌ఆర్టీసీ సోమవారం ప్రారంభించింది. జేఎన్‌టీయూ-వేవ్‌రాక్‌ మార్గంలో ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ బస్సు నడుస్తుందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ట్వీట్‌ చేశారు. మహిళా ప్రయాణికుల సౌకర్యార్థం త్వరలోనే మరిన్ని ప్రత్యేక బస్సులను టీఎస్‌ఆర్టీసీ ఏర్పాటు చేయనుందని తెలిపారు. ఐటీ కారిడార్‌లో రాకపోకలకు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని మహిళలను ఆర్టీసీ కోరుతునున్నట్లు సజ్జనార్‌ పేర్కొన్నారు.