హైదరాబాద్: టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌గా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో బాధ్యతలు చేపట్టారు. దీంతో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆర్టీసీకి మూడో చైర్మన్‌గా నిలిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు ఆర్టీసీ మరింత చేరువ కావాలని, ప్రగతిపథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, తదితరులు పాల్గొన్నారు.