హైదరాబాద్: తెలంగాణలో 503 గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల భర్తీకి ఆదివారం ఉదయం 10.30 నుంచి ఒంటి గంట వరకు టీఎస్‌పీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనుంది. దీని కోసం ఇప్పటికే 994 కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. పరీక్ష ప్రారంభ సమయానికి 15 నిమిషాల ముందు గేట్లు మూసివేస్తామని టీఎస్‌పీఎస్సీ ఓ ప్రకటనలో పేర్కొంది. పరీక్ష కేంద్రంలోకి వాచీలు, హ్యాండ్ బ్యాగ్‌లు, పర్సులు అనుమతించబోరు. అభ్యర్థులు చెప్పులు మాత్రమే వేసుకోవాలి. షఉ ధరించకూడదు. నలుపు లేదా నీలం రంగు పెన్ను మాత్రమే వాడాలి. జెల్, ఇంకు పెన్ను, పెన్సిళ్లను స్కానర్ గుర్తించదు. వైట్‌నర్, చాక్ పౌడర్, బ్లేడు, ఎరేజర్‌తో బబ్లింగ్ చేసే ఓఎంఆర్ షీట్ చెల్లదు'' అని టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. పరీక్షలో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ పరీక్ష కోసం 3,80,072 మంది దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.