
ప్రజాశక్తి-ఆచంట (పశ్చిమ గోదావరి జిల్లా) : మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై రాజకీయ ప్రేరేపిత కుట్రలో భాగంగా కక్షపూరిత అరెస్టు చేశారని.. దీనికి నిరసనగా పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంటలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆయన కుమారుడు పితాని వెంకట్ సారథంలో టిడిపి నాయకులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 10 వహొ రోజు శుక్రవారం కొనసాగుతున్నాయి. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పితాని వెంకట్ మాట్లాడుతూ ... ప్రజాస్వామ్యాన్ని పర్యరక్షించవలసిన ప్రభుత్వమే ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తుందని, చంద్రబాబు అరెస్టు ప్రజాస్వామ్యానికి మాయనిమచ్చని అన్నారు. ప్రజల్లో టిడిపికి వస్తున్న ఆదరణ చూసి జగన్ కు భయం పట్టుకుందని అన్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం కక్ష పూరిత సాధింపుతోనే కుట్ర చేసి చంద్రబాబు నాయుడు ను జైలుకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ అధికారాన్ని అడ్డుపెట్టుకొని రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన ఒక గొప్ప నాయకుడిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశం ముక్తకంఠంతో ఖండిస్తుందన్నారు. ఏది ఏమైనా చివరికి ధర్మమే గెలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ఉప్పలపాటి సురేష్ బాబు, ఎంపీపీ దిగమర్తి సూర్యకుమారి, మండల పార్టీ అధ్యక్షులు కేతా మీరయ్య, నాయకులు గొడవర్తి శ్రీరాములు, బలుసు శ్రీరామ్మూర్తి, నెక్కంటి ప్రభాకర్, కేతా మురళి, బాలాజీ, చిలుకూరి సీతారాం బీరా నరసింహమూర్తి. సుధాకర్, సత్యనారాయణ, శ్రీనివాస్, సత్యనారాయణ, వెంకటేశ, తదితరులు పాల్గొన్నారు.