Oct 08,2023 12:38

పశ్చిమ గోదావరి : చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ... పశ్చిమ గోదావరిలోని ఉండి మెయిన్‌ సెంటర్‌లో టిడిపి శ్రేణులు ఆదివారం ఉదయం వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఉండి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు నల్లని దుస్తులు ధరించి న్యాయానికి సంకెళ్లు అంటూ.. రెండు చేతులకు సంకెళ్లు వేసుకొని వినూత్న రీతిలో నిరసన దీక్ష చేపట్టారు.