Sep 25,2023 12:45

ప్రజాశక్తి-కశింకోట (అనకాపల్లి) : టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జైలు నుండి బయటకు రావాలి అని కోరుతూ.... కశింకోట మండలం పేరాంటాలపాలెం గ్రామాల్లో శారదా నది ఒడ్డున టిడిపి నేతలు సోమవారం పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ ... ఐటి విద్య ప్రపంచంలో అత్యంత స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ గుర్తింపు తెచ్చుకున్న చంద్రబాబు నాయుడుకు జైలు శిక్ష విధించడం ప్రజలు హర్షించబోరని అన్నారు. రానున్న ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధించడం ఖాయం అని అన్నారు. ప్రతి ఒక్కరు అన్యాయాన్ని నిలదీయాలని కోరారు. అనంతరం బిందెలు తో నీరు తెచ్చి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి గొంతిన శ్రీనివాసరావు, మండల టిడిపి అధ్యక్షుడు కాయలు మురళీ, మాజీ సర్పంచ్‌ లు బుదిరెడ్డి గంగయ్య, సిదిరెడ్డి సూర్యనారాయణ, యస్‌ కే బాబర్‌, జెర్రిపొతల నూకి నాయుడు, పెంటకొట తాతారావు, మెడిశెట్టి నాగ అప్పారావు, మహిళలు పాల్గొన్నారు.