
ప్రజాశక్తి-కశింకోట(అనకాపల్లి) : కశింకోట జాతీయ రహదారి పక్కన చంద్రబాబు నాయుడు మద్దతుగా మేము సైతం అంటూ టిడిపి నాయకులు గురువారం ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే పీలా గొవింద సత్యనారాయణ మాట్లాడుతూ.. చంద్రబాబును ఏశక్తి అడ్డుకోలేదన్నారు. ప్రజా సంక్షేమ కోసం కృషి చేసి అనేక మన్ననలు పొందిన వ్యక్తి చంద్రబాబు అని కొనయాడారు. చంద్రబాబు అరెస్టుకు వైసిపి తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుదన్నారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు కాయలు మురళీ, రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి గొంతుని శ్రీనివాసరావు, ఉగ్గిని రమణమూర్తి, వేగి గోపికృష్ణ, మాజీ ఎమ్‌పిపి పెంటకోట సుబ్బలక్ష్మి, సిదిరెడ్డి శ్రీనివాసరావు,టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.