
ప్రజాశక్తి-పాలకొల్లు(పశ్చిమగోదావరి) : పాలకొల్లు ఎమ్మెల్యే కార్యాలయం వద్ద టిడిపి చేపట్టిన రిలే నిరాహారదీక్షలు ఆదివారం ప్రారంభించారు. ఈ దీక్షల్లో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ తోపాటు 100 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. పోలీసులు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద దీక్షలు చేసుకోడానికి అనుమతి ఇవ్వక పోవడంతో ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి మధ్య దీక్షలు ప్రారంభించారు. ఈ దీక్ష లలో టిడిపి నేతలు పెచ్చెట్టి బాబు, జివి, కర్నేన గౌరు నాయుడు, కడలి గోపి, బోనం నాని మామిడిశెట్టి పెద్దిరాజు, మాతా రత్నరాజు, చిట్టూరి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఉదయం నుంచి ఎమ్మెల్యే ఇంటి వద్ద పాలకొల్లు, పెనుగొండ సిఐలు డి.రాంబాబు, నాగేశ్వరరావులు, పలువురు ఎస్‌ఐలు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.