
ప్రజాశక్తి-గణపవరం(పశ్చిమగోదావరి) : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో వైసిపి శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. నారా లోకేష్ నిడమర్రు మండలంలో పాదయాత్ర ముగించుకుని గణపవరం వస్తున్న సందర్భంగా ఆదివారం మందలపర్రు వద్ద టిడిపి శ్రేణులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలను వైసిపి నాయకులు చింపడంతో ఘర్షణ మొదలైంది. ఒక దశలో ఏమి జరిగిందో అర్థం కాలేదు. పోలీసులు కలగ చేసుకుని ఆందోళన కారులను చెదరగొట్టారు. లోకేష్ పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి వైసిపి వాళ్ళు తట్టుకోలేక కావాలనే దాడులు చేశారని టిడిపి నాయకులు తెలిపారు. జరిగిన గొడవపై వైసిపి నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.