
కొత్తపేట: చంద్రబాబు అనుభవం, పవన్ కల్యాణ్ ఆలోచన రాష్ట్రానికి అవసరమని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. బుధవారం కోనసీమ జిల్లా కొత్తపేటలో నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ప్రమాదవశాత్తూ మృతి చెందిన ఇద్దరు పార్టీ కార్యకర్తలకు రూ.5లక్షల ప్రమాద బీమా చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో మాట్లాడిన మనోహర్.. టిడిపి-జనసేన ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకెళ్లబోతున్నట్టు వివరించారు. త్వరలోనే ఉమ్మడి ప్రణాళికతో ఇంటింటికీ వెళ్లే కార్యక్రమం చేపడతామన్నారు. వైసిపి విముక్త ఏపీ కోసం ప్రజలంతా కంకణం కట్టుకున్నారని తెలిపారు.