Nov 06,2023 22:30

- ఫైనల్లో బరోడాపై 20పరుగుల తేడాతో గెలుపు
మొహాలీ: సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టైటిల్‌ను పంజాబ్‌జట్టు గెలుచుకుంది. సోమవారం జరిగిన ఫైనల్లో పంజాబ్‌ జట్టు 20పరుగుల తేడాతో బరోడాపై విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 223పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. అన్‌మోల్‌ప్రీత్‌ సింగ్‌(113; 61బంతుల్లో) సెంచరీకి తోడు నేహల్‌ వధేరా(61నాటౌట్‌; 27బంతుల్లో) ధనాధన్‌ బ్యాటింగ్‌తో మెరిసారు. బరోడా బౌలర్లు కృనాల్‌ పాండ్యా, షోయబ్‌ సొపారియా, అతిత్‌ సేఠ్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. ఛేదనలో బరోడా జట్టు నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 7వికెట్ల నష్టానికి 203పరుగులు చేసింది. అభిమన్యుసింగ్‌(61), నిబద్‌ రత్వా(47), కృనాల్‌ పాండ్యా(45) బ్యాటింగ్‌లో రాణించగా.. ఆర్ష్‌దీప్‌ సింగ్‌కు నాలుగు, మయాంక్‌ మార్కండే, హర్‌ప్రీత్‌ బ్రార్‌కు ఒక వికెట్‌ దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అన్‌మోల్‌ప్రీత్‌ సింగ్‌కు, ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ అభిషేక్‌ శర్మకు లభించాయి.