Nov 07,2023 22:23

లండన్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య(డబ్ల్యుటిఏ) తాజా ర్యాంకింగ్స్‌లో పోలండ్‌కు చెందిన ఇగా స్వైటెక్‌ మళ్లీ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను చేజిక్కించుకుంది. ఇటీవల ముగిసిన డబ్యుటిఏ ఫైనల్లో మాజీ నంబర్‌ వన్‌ క్రీడాకారిణి సబలెంకా.. జెస్సికా పెగూలా చేతిలో ఓటమితో ఇగా స్వైటెక్‌ అగ్రస్థానానికి చేరుకోవడానికి దోహదపడ్డాయి. ఇదే క్రమంలో ఇగా స్వైటెక్‌ అమెరికా వేదికగా జరిగిన బిల్లీ జీన్‌ కింగ్‌ ట్రోఫీని చేజిక్కించుకుంది. డబ్ల్యుటిఏ ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో బెలారస్‌కు చెందిన సబెలంక 2వ, అమెరికాకు చెందిన కోకా గాఫ్‌ 3వ ర్యాంక్‌లో ఉన్నారు. ఇక భారత్‌కు చెందిన అంకితా రైనా(201), కర్మన్‌ థండీ(308)వ ర్యాంక్‌లో ఉన్నారు.
డబ్ల్యుటిఏ టాప్‌-10 ప్లేయర్స్‌..
1. ఇగా స్వైటెక్‌(పోలండ్‌) : 9295(పాయింట్లు)
2. అర్యానా సబలెంక(బెలారస్‌) : 9050 ,,
3. కోకా గాఫ్‌(అమెరికా) : 6580 ,,
4. ఎలైనా రైబకినా(కజకిస్తాన్‌) : 6365 ,,
5. జెస్సికా పెగూలా(అమెరికా) : 5975 ,,
6. అన్స్‌ జబీర్‌(ట్యునీషియా) : 4195 ,,
7. మార్కెటా వోండ్రుసోవా(చెక్‌) : 4075 ,,
8. కరోలినా ముఛోవా(చెక్‌) : 3651 ,,
9. మరియా సక్కారి(గ్రీక్‌) : 3620 ,,
10. బార్బోరా క్రేజికోవా(చెక్‌) : 2880 ,,