వేసవి కాలంలో లభించే ఈత పండ్లను తినటం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. రక్తహీనతతో బాధపడేవారు ఈ పండ్లను తింటే ఆ సమస్య నుంచి బయటపడొచ్చు. శరీరంలో రోగనిరోధక శక్తి పెరగటమే కాకుండా శరీరంలో రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది.
- వేసవిలో లభించే ఈత పండ్లను పిల్లలకు తినిపిస్తే వారిలో ఎదుగుదల బాగుంటుంది. వీటిలో సమృద్ధిగా కాల్షియం ఉంటుంది. ఎముకలు బలంగా అవుతాయి.
- అల్జీమర్స్ వ్యాధితో బాధపడేవారికి ఈత పండ్లు తింటే ప్రయోజనం కనపడుతుంది. మెదడు చురుకుగా పని చేస్తుంది.
- ఈత పండ్లలో ఉండే గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్ తక్షణ శక్తిని ఇస్తాయి. వేసవిలో వచ్చే అలసటను దూరం చేస్తుంది. జీర్ణశక్తి బాగుంటుంది. మలబద్ధకం లాంటి సమస్యలు పోతాయి.
- ఈత పండ్లలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్త వృద్ధి జరుగుతుంది.










