
శీతాకాలం...చలి గాలులు బాగా విజృంభించే కాలం. ఈ కాలంలో చలి నుంచి కాపాడే దుస్తులు, స్వెట్టర్లు మార్కెట్లో విరివిగానే లభిస్తున్నాయి. చలి నుంచి వెచ్చదనం కోసం ఇవి దోహదపడతాయి. అందులోనూ మహిళలు చలికాలంలో బాగా ఇబ్బందులు పడుతుంటారు. నాణ్యమైన స్వెట్టర్లు వినియోగించటం ద్వారా చలి నుంచి ఎంతోకొంత ఉపశమనం పొందొచ్చు. ఈ స్వెటర్లు ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లోని మార్కెట్లలో విరివిగా విక్రయిస్తున్నారు. అనేక రంగులు, వివిధ డిజైన్లలో అందుబాటులో ఉన్నాయి.
టినీ డిజైన్ స్వీటర్ ఫర్ వింటర్ వేర్ : ఈ రకం స్వెట్టర్లు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. వీటిని ధరిస్తే వెచ్చని అనుభూతిని పొందొచ్చు. ధరించటం కూడా చాలా సులువే. శరీరానికి పూర్తి సౌకర్యంగా ఉంటుంది.
ఉలెన్ వి నెక్ కార్డియన్ స్వీటర్ ఫర్ వింటర్ : చూడటానికి కూడా చాలా చక్కగా ఉంటుంది. చాలా తేలికైన, సౌకర్యవంతమైన స్వెటర్. ఎలాస్టిక్ స్వభావం కలిగి ఉంది. అదనపు సౌకర్యాన్ని అందిస్తుంది. స్వెటర్‌ను దేనితోనైనా జత చేయొచ్చు. ధరిస్తే చాలా హుందాగా ఉంటుంది. నెక్, బటన్ క్లోజర్‌తో అందుబాటులో ఉంది.
ఉలెన్ స్వెట్టర్స్ : ఈ స్వెటర్‌ను ధరిస్తే మహిళలు మంచి స్టైలిష్ రూపాన్ని పొందొచ్చు. నెక్‌తో వస్తున్న లాంగ్ స్లీవ్ ఇవ్వబడింది. దీని మెటీరియల్ చాలా మృదువైంది. ధరిస్తే పూర్తి సౌకర్యవంతంగా ఉంటుంది. రోజువారీ ఉపయోగం కోసం సరైంది. జీన్స్, స్కర్ట్, లెగ్గింగ్స్ మొదలైన వాటితో జత చేయొచ్చు.
ఉమెన్ ఉలెన్ డిజైనర్ : దీనిని ధరిస్తే సౌకర్యంతోపాటు చూడటానికి అందంగా ఉంటుంది. ఇది చాలా మృధువైనది. వెచ్చని అనుభూతిని అందిస్తుంది. చలిలో చాలా ఉపశమనం పొందొచ్చు. స్వెట్టర్లను జీన్స్, ప్యాంట్, జెగ్గింగ్స్ లేదా లెగ్గింగ్‌లతో రెగ్యులర్ ఫిట్‌తో జత చేయొచ్చు. ప్రతిరోజూ ఆఫీసుకు కూడా ధరించొచ్చు.
ఉలెన్ బటన్ సాలిడ్ స్వెట్టర్ : దీని ఖరీదు కాస్త ఎక్కువగా ఉంటుంది. అల్లిక చాలా బాగుంది . దీని మెటీరియల్ చాలా మృథువుగా ఉంది. అదనపు సౌకర్యాన్ని పొందుతారు. అద్భుతమైన పూల డిజైన్‌తో వస్తుంది. ఇది మీ రూపాన్ని మరింత మెరుగుపరుస్తుంది. దీనిని ఉతకటం కూడా చాలా సులువు.