
పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : పాలకొల్లు నియోజకవర్గంలో దట్టమైన మంచు ప్రభావంతో మండు వేసవి నుంచి ప్రజలు ఉపశమనం చెందారు. శనివారం తెల్లవారుజామున దట్టమైన మంచు ప్రభావం తీవ్రంగా ఉండటంతో ప్రజలు ఆనంద వ్యక్తం చేస్తున్నారు. ఒకపక్క ఏప్రిల్ నెలలో సూర్య ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగి వేసవి తాపంతో విలవిలలాడుతుంటే ... మంచు సోయగం ఆకాశమంతా కప్పి ఆనందం ఇస్తోంది. అకాల వర్షాలు రావడం, అకాల మంచు ప్రభావం ఉండటంతో వాతావరణంలో ఏ మార్పులు వస్తాయో అని ప్రజలు భయపడుతున్నారు. మొత్తానికి సామాన్య, మధ్యతరగతి ప్రజలు వేసవి ఉక్కబోత నుంచి ఉపశమనం కలిగి మంచు ప్రభావంతో ఆనంద వ్యక్తం చేస్తున్నారు.