పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : పాలకొల్లులో వైసిపి ఇన్చార్జి గుడాల గోపి, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బుధవారం ఉదయం మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ ను పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ముందు ప్రకటించిన ప్రకారం టిడ్కో గృహాల వద్దకు వెళ్లడానికి టిడిపి కార్యకర్తలు వందలాదిగా ఎమ్మెల్యే ఆఫీస్ వద్దకు వచ్చారు. వైసిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున గాంధీ బొమ్మ సెంటర్ వద్దకు వచ్చారు. దీంతో పాలకొల్లులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.