పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : యూత్ హాస్టల్స్ ఆఫ్ ఇండియా, పాలకొల్లు శాఖ నుంచి 40 మంది బఅందం చార్ ధాం యాత్రకు శుక్రవారం పాలకొల్లు నుంచి బయలుదేరారు. వీరికి పాలకొల్లు రైల్వే స్టేషన్ లో చాంబర్ అధ్యక్షులు కారుమూరి నర్సింహారావు వీడ్కోలు పలికారు. వీరు శుక్రవారం మధ్యాహ్నం విజయవాడలో దురంతో ఎక్స్ ప్రెస్ లో ఢిల్లీ కీ బయలుదేరారు. యూత్ హాస్టల్స్ జాతీయ సభ్యులు కారుమూరి సూర్య నారాయణ సారధ్యంలో బృందంలో 12 మంది మహిళలు ఉన్నారు. అక్టోబర్ 5 వరకు వీరు ఛార్ ధాం యాత్రలో పాల్గొంటారు. దేశ వ్యాప్తంగా యూత్ హాస్టల్స్ తరపున జాతీయ ట్రెక్కింగ్ అండ్ ట్రైనింగ్ కింద ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. గతంలో పాలకొల్లు నుంచి మోటార్ సైకిళ్ళు పై కన్యాకుమారి, వారణాశి, అయోధ్య, ఢిల్లీ నుంచి లేహ్ యాత్రలు నిర్వహించారు.