Oct 23,2023 14:50

ప్రజాశక్తి-అమరావతి :బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది క్రమంగా తుపానుగా, అనంతరం తీవ్రతుపానుగా మారే అవకాశాలున్నట్లు పేర్కొంది. ఈ నెల 25 సాయంత్రం బంగ్లాదేశ్‌ తీరంలో ఖేపుపారా-చిట్టగాంగ్‌ ప్రాంతాల మధ్య తీరం దాటే అవకాశముందని ఐఎండీ వివరించింది. కాగా, విశాఖ వాతావరణ కేంద్రం కూడా దీనిపై అప్‌ డేట్‌ అందించింది. కోస్తాంధ్రలో రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.