
అమరావతి : ఎండ తీవ్రతతో.. వడగాల్పులతో అల్లాడిపోయిన ఎపి రాష్ట్రానికి వాతావరణశాఖ చల్లటి కబురు తెలిపింది. రేపటి నుండి రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందని ప్రకటించింది. ప్రస్తుతం శ్రీహరికోట, పుట్టపర్తి, కర్నాటక, రత్నగిరి, కొప్పల్ ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్న రుతుపవనాలు ... క్రమంగా కదులుతూ రాష్ట్రమంతటా విస్తరిస్తాయని తెలిపింది.
వాతావరణశాఖ అధికారులు మాట్లాడుతూ ... అటు అరేబియాలోని బిపర్‌జాయ్ తుఫాన్ బలహీనపడుతుండటంతో బంగాళాఖాతంలో దట్టమైన మేఘాలు ఏర్పడ్డాయని తెలిపారు. ఇప్పటికే రాయలసీమలోని చిత్తూరు, కర్నూల్, తిరుపతి, వైఎస్సార్ జిల్లాల్లో చిరుజల్లులు కురుశాయని.. వచ్చే 24 గంటల్లో రాయలసీమలోని ప్రాంతాలతోపాటు రాష్ట్రంలోని అనేక చోట్ల మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురవచ్చునని వాతావరణ శాఖ వివరించింది.