- జెన్నిహెర్మొనో ముద్దు వ్యవహారం
మాడ్రిడ్: స్పెయిన్ మహిళా ఫుట్‌బాలర్‌ను ముద్దు పెట్టుకున్న వ్యవహారం పెను తుఫానును రేపింది. స్పెయిన్ ఫుట్‌బాల్ చీఫ్ లూయిస్ రూబియేల్స్‌పై అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య(ఫిఫా) సస్పెన్షన్ వేటు వేసింది. స్పెయిన్ మహిళలజట్టు ఫిఫా టైటిల్ నెగ్గిన తర్వాత మిడ్ ఫీల్డర్ జెన్నిహెర్మొసో రూబియేల్స్ పెదవులపై ముద్దు కొన్నాడు. దీంతో ఆమె ఈ విషయాన్ని స్పెయిన్ ఫుట్‌బాల్ సమాఖ్యకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం పెను దుమారం లేవడంతో రూబియేల్స్ తొలుత రాజీనామా చేస్తానని ప్రకటించి ఆ తర్వాత వెనక్కి తగ్గాడు. దీంతో తాజాగా రూబియేల్స్‌ను సస్పెండ్ చేస్తూ ఫిఫా తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. రూబియేల్స్‌పై 90 రోజులపాటు తాత్కాలిక సస్పెన్షన్ విధిస్తున్నట్లు ఫిఫా శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. అలాగే ఫిఫా క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అన్ని ఫుట్‌బాల్ సంబంధిత కార్యకలాపాలనుంచి రూబియేల్స్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఫిఫా ఆ ప్రకటనలో పేర్కొంది.










