Aug 24,2023 09:13

నియామె : ఆఫ్రికన్‌ యూనియన్‌కు సంబంధించిన అన్ని సంస్థలు, కార్యకలాపాల నుండి నైగర్‌ను సస్పెండ్‌ చేశారు. నైగర్‌లో రాజ్యాంగ వ్యవస్థను సమర్ధవంతమైన రీతిలో పునరుద్ధరించేవరకు ఈ సస్పెన్షన్‌ తప్పదని ఆఫ్రికన్‌ యూనియన్‌ హెచ్చరించింది. నైగర్‌ అద్యక్షుడు మహ్మద్‌ బజూమ్‌ను పదవీచ్యుతుడిని చేసి, ఆయనను, ఆయన కుటుంబ సభ్యులను మిలటరీ గ్రూపు రాజధానిలో గృహ నిర్బంధంలో వుంచింది. మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడిన కొత్త మిలటరీ పాలకులు, వారి మద్దతుదారులపై ఆంక్షలు విధిస్తామని ఆఫ్రికన్‌ యూనియన్‌ హెచ్చరించింది.