May 16,2023 20:44

హైదరాబాద్‌ : గడిచిన ఆర్థిక సంవత్సరం 2022-23 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో సూర్యోదయ్ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ (ఎస్‌ఎస్‌ఎఫ్‌బి) రూ.39 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో రూ.48 కోట్ల నష్టాలు చవి చూసింది. గడిచిన క్యూ4లో బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం 43 శాతం పెరిగి రూ.210 కోట్లుగా నమోదయ్యింది. ఇతర ఆదాయం 70 శాతం వృద్థితో రూ.34 కోట్లుగా చోటు చేసుకుంది. స్థూల నిరర్థక ఆస్తులు 4.23 శాతం నుంచి 3.13 శాతానికి తగ్గాయి.