Nov 14,2022 07:14

సాహితీకిరణం - సూర్య సాహితీవేదిక సంయుక్త ఆధ్వర్యంలో బాలల కథల పోటీ నిర్వహిస్తున్నాం. ప్రథమ బహుమతి: రూ.3000, ద్వితీయ బహుమతి రూ.2500, తృతీయ బహుమతి రూ.1500; ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున 5 ప్రత్యేక బహుమతులు ఉంటాయి.కథ నిడివి చేతిరాతలో 2 పేజీలకు, డిటిపిలో ఒక పేజీకి మించరాదు. రచనపై రచయిత పేరు, చిరునామా, సెల్‌ నెంబర్‌ ఉండరాదు. హామీపత్రంపై విడిగా రాయాలి. బాలల్లో నైతిక విలువలు, కుటుంబ అనుబంధాలు, సృజనాత్మకత, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, సాహసం తదితర అంశాలు ప్రతిబింబించే కథలు మాత్రమే రాయాలి. కథలు పోస్టు/ కొరియర్‌ ద్వారా మాత్రమే 30.11.2022లోగా పంపాలి. చిరునామా : సాహితీకిరణం ఇం.నెం. 11-13-154, అలకాపురి, రోడ్‌ నెం. 3, హైదరాబాద్‌-500102. ఫోన్‌: 040-29550181.
- పొత్తూరి సుబ్బారావు