బెంగళూరు : ఫ్యాషన్ మెన్స్‌వేర్ బ్రాండ్ టిఐజిసి తన బ్రాండ్ అంబాసీడర్‌గా క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్‌ను నియమించుకున్నట్లు ప్రకటించింది. సూర్య కుమార్ ప్రజాదరణ తమ పూర్తి సరికొత్త శ్రేణీ క్యాజువల్ అప్పెరల్ శ్రేణికి ప్రచారం చేయనున్నారని పేర్కొంది. దేశంలో డిజిటల్ ఫస్ట్ ఫ్యాషన్ మార్కెట్‌ను చేజిక్కుంచుకునేందుకు ఇది మా తొలి అడుగు అని టిఐజిసి ఫౌండర్, సిఇఒ అనంత్ టాంటెడ్ తెలిపారు. సూర్య కుమార్‌తో బలమైన బంధం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామన్నారు.










