Jul 20,2023 12:44

ప్రజాశక్తి-జంగారెడ్డిగూడెం(ఏలూరు) : ల్యాండ్‌ సీలింగ్‌ భూములు ఎర్రకాలువ ప్రాజెక్టు మిగిల్‌ భూములు పేదలకు పంచాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. గురువారం ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో స్థానిక ప్రజా సంఘాల కార్యాలయం నుండి తహశీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు మానుకొండ జీవరత్నం మాట్లాడుతూ.. దశాబ్దాలుగా ల్యాండ్‌ సీలింగ్‌ భూములు పేదలకు పంచాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తున్న ప్రభుత్వాలకు చలనం రావడం లేదన్నారు. అలాగే ఎర్రకాలువ ప్రాజెక్టు మిగిలి భూములలో పరిహారం పొందిన భూస్వాములే అనుభవిస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు భూమిలేని నిరుపేదలకు ల్యాండ్‌ సీలింగ్‌ భూములు మిగులు భూములు పంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి నవరత్నాలను దశరత్నాలుగా మార్చి భూ పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు లేకుంటే ఎమ్మెల్యే ను పేదలందరితో ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి అందుగుల ప్రభాకర్‌ రావు, జి సూర్యకిరణ్‌ పలువురు నాయకులు కార్యకర్తలు పేదలు పాల్గొన్నారు.