Oct 10,2023 14:48

ప్రజాశక్తి-నందిగామ (ఎన్‌టిఆర్‌) : ప్రత్యేక అవసరాల విద్యార్థులకు ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని నందిగామ జూనియర్‌ ప్రిన్సిపల్‌ సివిల్‌ జడ్జి పి.తిరుమలరావు పేర్కొన్నారు. బుధవారం వరల్డ్‌ మెంటల్‌ హెల్త్‌ డే సందర్భంగా నందిగామ నెహ్రు నగర్‌ భవిత కేర్‌ సెంటర్‌లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా నందిగామ ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి పి.తిరుమలరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేర్‌ సెంటర్‌లోని చిన్నారుల సౌకర్యాలు గురించి తెలుసుకున్నారు. చిన్నారులకు బిస్కెట్‌, క్రేయన్స్‌ అందించారు. ప్రత్యేక అవసరాల విద్యార్థులకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. వారికి ప్రత్యేక చట్టాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో నందిగామ బార్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షులు బొబ్బిల్లపాటి భాస్కర్‌ రావు, ఎపిపి ఈశ్వరప్రగడ రంగారావు, ఎజిపి మట్టా ప్రసాద్‌, న్యాయవాది కొమ్మినేని మౌలేశ్వర రావు, ఈశ్వరప్రగాఢ శేషగిరిరావు , కేర్‌ సెంటర్‌ నిర్వాహకులు రిసోర్స్‌ పర్సన్‌ కె. వి. ఎన్‌.మల్లేశ్వరరావు, శారద, వాలంటీర్‌ అనూష పాల్గొన్నారు.