Jan 31,2023 13:11

ప్రజాశక్తి - రెడ్డిగూడెం (ఎన్‌టిఆర్‌) : రెడ్డిగూడెం మండల కేంద్రంలో ఉన్న '' ఫ్రెండ్స్‌ సర్వీస్‌ సొసైటీ ఆఫ్‌ ఫ్రీ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ '' లోని గురుకుల పాఠశాలల్లో 5 వ తరగతి ప్రవేశానికి జరిగే ప్రవేశ పరీక్షకు సిద్ధపడుతున్న విద్యార్థులకు మంగళవారం స్టడీ మెటీరియల్‌ కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు చాట్ల విజయ్ కుమార్‌ మాట్లాడుతూ ... గత ఎనిమిది సంవత్సరాలుగా చేస్తున్నట్టే ఈ సంవత్సరం కూడా గురుకుల పాఠశాలలో ప్రవేశం కోసం జరిగే పరీక్షకు ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ, ఓబిసి విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వడంతోపాటు ఉచితంగా మెటీరియల్‌ కూడా పంపిణీ చేశామని తెలిపారు. వారానికి ఒక మోడల్‌ పరీక్ష నిర్వహిస్తామని అన్నారు. తరగని సంపదయైన విద్యను తమ ''సంస్థ ఫ్రెండ్స్‌ సర్వీస్‌ సొసైటీ'' ద్వారా ఉచితంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెవ జి.విశ్వనాథ్‌, ''ఫ్రెండ్స్‌ సర్వీస్‌ సొసైటీ'' సలహాదారుడు ప్రత్తిపాటి పాల్‌ఇమ్మానుయేలు, డైరెక్టర్‌ చాట్ల హన్న, ప్రమీల, సుధ, తదితరులు పాల్గొన్నారు.