Jun 07,2023 13:13

ప్రజాశక్తి-చాగల్లు (తూర్పు గోదావరి) : చాగల్లు శాఖా గ్రంధాలయం, చంద్రవరం శాఖ గ్రంధాలయం వద్ద బుధవారం సమ్మర్‌ క్యాంపులో విద్యార్థిని విద్యార్థులతో స్టోరీ టెల్లింగ్‌, స్టోరీ రీడింగ్‌ చేయించారు. అనంతరం మాతఅమూర్తిగా, మానవతావాదిగా, విద్యాదాతగా, ఎందరికో ఉపాధి చూపిన మార్గదర్శకురాలిగా పేరుగాంచిన మదర్‌ థెరిసా జీవిత విశేషాలను విద్యార్థులతో చదివించారు. బీదలకు, ఆపన్నులకు తన శక్తినంతా ధారపోసి సేవలందించిన మదర్‌ ధెరిసా జీవిత విధానాన్ని విద్యార్థులకు వివరించారు. గ్రామపంచాయతీ వార్డు సభ్యులు మద్దిపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ ... మదర్‌ థెరిసా ప్రపంచానికి తల్లి లాంటిది అని మహౌన్నత మానవతామూర్తి అని విద్యార్థులందరూ సేవా దఅక్పథంతో ఉండాలని అన్నారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు గ్రంధాలయాలు తప్పనిసంగా సందర్శించాలని ఎన్నో శాస్త్ర సాంకేతిక విషయాలు తెలుసుకోవచ్చని అన్నారు. అనంతరం విద్యార్థులకు స్నాక్స్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంధాల అధికారి కే.సుమన్‌ కుమార్‌, రిసోర్స్‌ పర్సన్స్‌ ఎన్‌ గౌతమ్‌, వి.మణికంఠ, విద్యార్థులు పాల్గొన్నారు.